ఎన్‌కౌంటర్‌‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం | Two terrorists gunned down by Army in Bandipora | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

Nov 22 2016 11:14 AM | Updated on Sep 4 2017 8:49 PM

ఎన్‌కౌంటర్‌‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

ఎన్‌కౌంటర్‌‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బండీపూరలోని  హంజన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ, పోలీసు బలగాలు జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించాయి. ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న సమయంలో అక్కడే నక్కిన ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఆ ప్రాంతంలో మరికొందరు ఉగ్రవాదులు ఉండొచ్చన్న సమాచారంతో తనిఖీలు కొనసాగుతున్నాయి.

సోమవారం పూంచ్‌, రాజౌరి జిల్లాలలో పాకిస్తాన్‌ ఆర్మీ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటంతో ఓ పౌరుడు గాయపడ్డాడని అధికారులు వెల్లడించారు. బొసానీ గ్రామంలో అబ్దుల్‌ అజీజ్‌ అనే వ్యక్తి ఇంటిపై మోటార్‌ షెల్స్‌ పడటంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. బీఎస్‌ఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ రాయ్‌ సింగ్‌ సైతం పాక్‌ కాల్పుల్లో గాయపడ్డాడని అధికారులు వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement