పౌర బిల్లు రగడ : బస్‌లు దగ్ధం

Two Buses Set On Fire By Protesters In South Delhi   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ బిల్లుపై దేశ రాజధాని ఢిల్లీలో హింసాత్మక నిరసనలు కొనసాగుతున్నాయి. బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (డీటీసీ)కు చెందిన రెండు బస్సులను దగ్ధం చేశారు. భరత్‌ నగర్‌లో డీటీసీ బస్‌కు ఆందోళనకారులు నిప్పంటించగా ఆ ప్రాంతానికి అగ్నిమాపక యంత్రాలు చేరుకున్నాయి. మరోవైపు ఫైరింజన్లు ఘటనా స్ధలానికి చేరుకుంటుండగా ఓ ఫైరింజన్‌ను జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్ధులు అడ్డగించి ధ్వంసం చేశారని ఢిల్లీ ఫైర్‌ సర్వీసు అధికారులు తెలిపారు.


ఘటన చోటుచేసుకున్న మధురా రోడ్డుకు వెళ్లకుండా ఆ మార్గాన్ని ఆందోళనకారులు దిగ్బంధించారు. ఫైరింజన్‌ను దగ్ధం చేసిన ఘటనలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బందికి గాయాలయ్యాయి. ఆందోళనల నేపథ్యంలో సరితా విహార్‌కు వెళ్లే ఓఖ్లా అండర్‌పాస్‌పై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. రహదారి నిర్బంధంతో బదార్పూర్‌, ఆశ్రమ్‌ చౌక్‌ నుంచి వచ్చే వాహనాలను దారిమళ్లించారు.

చదవండి: ‘పౌరసత్వం’ అపోహలు.. నిజాలు తెలుసుకోండి..!
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top