దేవెగౌడపై అభ్యంతరకర వీడియో : ఇద్దరి అరెస్ట్‌ | Two Arrested For Mocking Deve Gowda In Karnataka | Sakshi
Sakshi News home page

దేవెగౌడపై అభ్యంతరకర వీడియో : ఇద్దరి అరెస్ట్‌

Jun 11 2019 6:59 PM | Updated on Jun 11 2019 6:59 PM

Two Arrested For Mocking Deve Gowda In Karnataka - Sakshi

దేవెగౌడపై అభ్యంతరకర వీడియో : ఇద్దరి అరెస్ట్‌

బెంగళూర్‌ : మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడతో పాటు ఆయన కుటుంబ సభ్యులను వేధిస్తూ అభ్యంతరకర వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్‌ కస్టడీకి తరలించామని పోలీసులు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో పరాజయానికి జేడీ(ఎస్‌)లో కుటుంబ రాజకీయాలే కారణమని నిందించేలా ఈ వీడియోలను పోస్ట్‌ చేశారని చెప్పారు.

జేడీ(ఎస్‌) నేత ఫిర్యాదుపై నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టు ఆదేశాలతో జ్యుడిషియల్‌ కస్టడీకి తరలించామని తెలిపారు. కాగా నిందితులు ఆ పార్టీ కార్యకర్తలేనని వీరిని పెట్రోల్‌ పంప్‌లో పనిచేసే సిద్దరాజు, క్యాబ్‌ డ్రైవర్‌ చామరాజులుగా గుర్తించామని తెలిపారు. కాగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై అభ్యంతరకర పోస్ట్‌లను షేర్‌ చేశారంటూ ముగ్గురు జర్నలిస్టులను అరెస్ట్‌ చేయడంపై సర్వత్రా నిరసన వెల్లువెత్తింది. ఇది నెటిజన్ల స్వేచ్ఛను హరించడమేననే వాదన ముందుకొచ్చింది. మరోవైపు ఈ కేసులో అరెస్ట్‌ అయిన జర్నలిస్ట్‌ ప్రశాంత్‌ కనోజియాను తక్షణమే విడుదల చేయాలని యూపీ పోలీసులను సుప్రీం కోర్టు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement