ఉర్జిత్ పటేల్ ట్విట్టర్ ఫేక్ అకౌంట్ తొలగింపు! | Twitter deletes fake account of RBI Guv designate Urjit Patel | Sakshi
Sakshi News home page

ఉర్జిత్ పటేల్ ట్విట్టర్ ఫేక్ అకౌంట్ తొలగింపు!

Aug 23 2016 9:28 PM | Updated on Sep 4 2017 10:33 AM

ఉర్జిత్ పటేల్ ట్విట్టర్ ఫేక్ అకౌంట్ తొలగింపు!

ఉర్జిత్ పటేల్ ట్విట్టర్ ఫేక్ అకౌంట్ తొలగింపు!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నూతన గవర్నర్ గా వచ్చే నెలలో బాధ్యతలు చేపట్టనున్న ఉర్జిత్ పటేల్ పేరుతో ఉన్న ట్విట్టర్ ఫేక్ అకౌంట్ను డిలీట్ చేశారు.

న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నూతన గవర్నర్ గా వచ్చే నెలలో బాధ్యతలు చేపట్టనున్న ఉర్జిత్ పటేల్ పేరుతో ఉన్న ట్విట్టర్ ఫేక్ అకౌంట్ను డిలీట్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ సంస్థ మంగళవారం వెల్లడించింది. గత శనివారం ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ పేరును ఖరారు చేసినట్లు అధికార వర్గాలు తెలిపిన వెంటనే ఈ ట్విట్టర్ ఖాతాకు అభినందనల వెల్లువ మొదలైంది.

తనపేరుతో ఉన్న నకిలీ ఖాతా గురించి తెలిపిన వెంటనే ట్విట్టర్ మేనేజ్ మెంట్ ఆ అకౌంట్ ను తొలగించింది. ఈ ఫేక్ అకౌంట్ ఈ ఏడాది జూన్ నెలలో క్రియేట్ చేశారని, అయితే ఉర్జిత్ పటేల్ పేరును ఆర్‌బీఐ గవర్నర్ గా ప్రకటించక ముందువరకు ఒక్క ట్వీట్ కూడా ఆ ఖాతా నుంచి చేయలేదని ఆర్బీఐ వెల్లడించింది. ఉర్జిత్ పటేల్ ప్రస్తుతం ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement