13 మందిని హతమార్చిన పులి హతం

Tigress Avni Shot Dead in Maharashtra - Sakshi

సాక్షి, ముంబై : మహారాష్ట్రలో సుమారు 13 మంది మృతికి కారణమైన ఆడ పులి అవని(T1) ని శుక్రవారం రాత్రి అంతమొందించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. యవత్మాల్‌ ప్రాంతంలో సంచరిస్తూ.. మనుషుల మాంసానికి రుచి మరిగిన అవని వల్ల ప్రమాదం పొంచి ఉన్నందున కనిపించిన వెంటనే కాల్చిపారేయలని సుప్రీం కోర్టు ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అవనిని ప్రాణాలతోనే పట్టుకోవాలంటూ చేంజ్‌. ఆర్గ్‌ అనే సంస్థ వేసిన పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. కాగా గత రెండేళ్లుగా అధికారులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతూ తమ ప్రాణాలకు ప్రమాదంగా పరిణమించిన పులిని మట్టుబెట్టినందుకు యవత్మాల్‌ పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సగానికి పైగా మన దేశంలోనే..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల మొత్తం జనాభాలో సగానికి పైగా భారత్‌లోనే ఉందని 2014 గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మన దేశంలోని వివిధ అరణ్యాల్లో సుమారు 2,226 పులులు ఉన్నట్లుగా గుర్తించారు. కాగా ప్రతీ ఏడాది దాదాపు 12 పులులు చనిపోతున్నాయని, ఇలా అయితే భవిష్యత్తులో పులుల ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉందని జంతు హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top