బిడ్డను పోగొట్టుకున్న చోటే ఆరేళ్లుగా.. | The woman whose daughter's death led her to save others | Sakshi
Sakshi News home page

బిడ్డను పోగొట్టుకున్న చోటే ఆరేళ్లుగా..

Feb 21 2016 7:11 PM | Updated on Sep 3 2017 6:07 PM

బిడ్డను పోగొట్టుకున్న చోటే ఆరేళ్లుగా..

బిడ్డను పోగొట్టుకున్న చోటే ఆరేళ్లుగా..

కన్న కూతురును పోగొట్టుకున్న ఓ తల్లి, తనలాంటి బాధ మరో తల్లికి రాకూడదని ఆరేళ్లుగా కష్టపడుతోంది.

కన్న కూతురును పోగొట్టుకున్న ఓ తల్లి, తనలాంటి బాధ మరో తల్లికి రాకూడదని ఆరేళ్లుగా కష్టపడుతోంది. నిబద్దతతో పని చేస్తూ డోరిస్ ఫ్రాన్సిస్ అనే ఓ మహిళ ఏకంగా ట్రాఫిక్ హీరోయిన్‌గా పేరుకూడా తెచ్చుకుంది. పోలీసు అధికారిని కాకపోయినా దేశ రాజధాని సమీపంలోని గజియాబాద్‌లో గత ఆరేళ్లుగా వాహనాలను నియంత్రించే పనిలో నిమగ్నమయ్యారు.

2010లో గజియాబాద్‌లోని రద్దీ కూడలిలో ప్రస్తుతం ఫ్రాన్సిస్ పనిచేసే చోటే ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అతి వేగంగా వచ్చిన ఓ కారు, ఆటోను ఢీకొంది. ఆ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఫ్రాన్సిస్ కూతురు నిక్కి అక్కడికక్కడే మృతిచెందింది. అయితే ఫ్రాన్సిస్‌ స్వల్పగాయాలతో బయటపడింది.

'ఆ రోజు వాహనాలను సరిగ్గా నియంత్రించి ఉంటే నా కూతురు నాకు దక్కి ఉండేది. పర్యవేక్షణ లోపంతోనే ఆ కూడలి దగ్గర డ్రైవర్లు నర్లక్ష్యంతో నడుపుతున్నారన్న విషయం నాకు అర్థం అయింది. అందుకే అప్పటి నుంచి ట్రాఫిక్ నియంత్రించే పనిలో నిమగ్నమయ్యాను. ప్రయాణికుల ప్రాణాలను కాపాడటమే నా లక్ష్యం. ఏ తల్లీతండ్రులు తమ పిల్లలను కోల్పోకూడదు. అందుకే నా శరీరం సహకరించే వరకు ఈ పని చేస్తూనే ఉంటాను' అని ఫ్రాన్సిస్ కన్నీటి పర్యంతమయ్యారు.

సాధారణంగా ఆ కూడలిలో ఫ్రాన్సిస్ ఉంటే వాహనదారులు ట్రాఫిక్ నిబందనలకు కచ్చింతంగా పాటిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసే వారి విషయంలో కట్టె చేత్తో  పట్టుకొని మరీ ఫ్రాన్సిస్ ట్రాఫిక్ నియంత్రిస్తుంటారు.

'నాకు ఆమె కథ తెలుసు, నిస్వార్థంగా ఆమె ఈ పని చేస్తుంది. ఆవిడలాంటి ధైర్యవంతురాలిని నేను ఎక్కడా చూడలేదు. ప్రతి రోజు తన కూతురును కోల్పోయిన చోటు దగ్గరికే వచ్చి ఎలా పని చేయగలుగుతోందో' అని అక్కడే పని చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ ఒకరు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement