నేటినుంచే ఎంఐ-5 సేల్స్..రేటెంతో తెలుసా? | The Rs 24,999 Xiaomi Mi 5 goes on sale in India | Sakshi
Sakshi News home page

నేటినుంచే ఎంఐ-5 సేల్స్..రేటెంతో తెలుసా?

Apr 6 2016 2:32 PM | Updated on Nov 6 2018 5:26 PM

నేటినుంచే ఎంఐ-5 సేల్స్..రేటెంతో తెలుసా? - Sakshi

నేటినుంచే ఎంఐ-5 సేల్స్..రేటెంతో తెలుసా?

తక్కువ ధరలకే హైఎండ్‌ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్లను అందించే చైనీస్‌ మొబైల్ మేకర్ షియోమీ.. తన ప్రతిష్టాత్మక మోడలైన 'ఐఎం-5' అమ్మకాలను బుధవారం నుంచి భారత్ లో ప్రారంభించింది.

న్యూఢిల్లీ: తక్కువ ధరలకే హైఎండ్‌ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్లను అందించే చైనీస్‌ మొబైల్ మేకర్ షియోమీ.. తన ప్రతిష్ఠాత్మక మోడలైన 'ఐఎం-5' అమ్మకాలను బుధవారం నుంచి భారత్ లో ప్రారంభించింది. దీని ధర రూ. 24,999. ఎంఐ.కామ్ వెబ్ సైట్ లో ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.  

అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ తెలుపు, నలుపు, బంగారం.. ఇలా మూడు రంగులలో లభిస్తుంది. దీనిలో రెండు వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి హైయర్ ఎండ్ 3డీ సెరామిక్ మోడల్.. దీనిపై గీతలు పడే చాన్స్‌ ఉండదు. మరొకటి కాస్తధరకు లభించే 3డీ గ్లాస్ మోడల్‌. దీనిపై అంతో ఇంతో గీతలు పడే అవకాశముంటుంది.

'ఎంఐ 5'లో 16 మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరా, 4కే వీడియోను అలవోకగా తెరకెక్కించగలిగే సోనీ ఐఎంఎక్స్298 సెన్సర్‌తో రానుంది. బాగా కదులుతూ వీడియో రికార్డ్ చేసినా షేక్‌ అవ్వకుండా ఇందులో 4 యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ టెక్నాలజీని ఉపయోగించారు. మొత్తంగా ఎంఐ-5 మూడు వెర్షన్లలో లభించనుంది. ఇందులో 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్, త్రీడీ సెరామిక్ బాడీ గల మోడల్‌ ధర రూ. 28 వేలు కాగా, 64 జీబీ స్టోరేజ్‌ గల మోడల్  రూ. 24 వేలకు, 32 జీబీ స్టోరేజి గల మోడల్ రూ. 20వేలకు లభించనున్నాయి. తక్కువ ధర కలిగిన రెండు మోడళ్లలోనూ 3 జీబీ ర్యామ్‌, త్రీడీ గ్లాస్ బాడీ ఉంటుంది.

జియోమీ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఈ మోడల్ లో ఇతర ఫీచర్లు ఇవి:
డ్యుయెల్ సిమ్‌
అత్యంత శక్తిమంతమైన హెచ్‌డీ డిస్‌ప్లే, థిన్‌ సైజ్‌  
ప్రాసెసర్‌: స్నాప్‌డ్రాగన్ 820 క్వాల్‌కామ్
బ్యాటరీ: 3,000 ఎంఏహెచ్‌
బరువు: 129 గ్రాములు (ఐఫోన్‌ 6ఎస్‌ కన్నా 14 గ్రాములు తక్కువ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement