‘బ్లాక్‌మనీపై దర్యాప్తు పురోగతి చెప్పండి’ | Tell the progress of the investigation on the black money | Sakshi
Sakshi News home page

‘బ్లాక్‌మనీపై దర్యాప్తు పురోగతి చెప్పండి’

Apr 22 2015 1:03 AM | Updated on Apr 3 2019 5:16 PM

‘బ్లాక్‌మనీపై దర్యాప్తు పురోగతి చెప్పండి’ - Sakshi

‘బ్లాక్‌మనీపై దర్యాప్తు పురోగతి చెప్పండి’

నల్లధనంపై దర్యాప్తు పురోగతిని వివ రిస్తూ మే 12కల్లా తమకు నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు సిట్‌ను ఆదేశించింది.

న్యూఢిల్లీ: నల్లధనంపై దర్యాప్తు పురోగతిని వివ రిస్తూ మే 12కల్లా తమకు నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు సిట్‌ను ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ మదన్ బి లోకూర్, ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు వెలువరించింది.

వచ్చేనెల 12కల్లా నివేదిక సమర్పిస్తే వేసవి సెలవులకు ముందు ఈ అంశాన్ని పరిశీలించే వీలుంటుందని సిట్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సోలి సొరాబ్జీకి ధర్మాసనం సూచించింది. సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలోని సిట్ నల్లధనంపై దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement