తరుణ్ తేజ్పాల్కు 6 రోజుల పోలీస్ కస్టడీ | Tarun Tejpal remanded in 6-day police custody | Sakshi
Sakshi News home page

తరుణ్ తేజ్పాల్కు 6 రోజుల పోలీస్ కస్టడీ

Dec 1 2013 4:23 PM | Updated on Aug 21 2018 7:17 PM

తరుణ్ తేజ్పాల్కు 6 రోజుల పోలీస్ కస్టడీ - Sakshi

తరుణ్ తేజ్పాల్కు 6 రోజుల పోలీస్ కస్టడీ

లైంగిక వేధింపుల కేసులో తెహల్కా మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్ను ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీకి పంపారు.

లైంగిక వేధింపుల కేసులో తెహల్కా మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్ను ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీకి పంపారు. గోవా పోలీసులు ఆదివారం తేజ్పాల్ను ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచారు.

కేసుకు సంబంధించి విచారించేందుకు తేజ్పాల్ను 14 రోజుల పాటు పోలీస్ కస్టడీకి పంపాలని అంతకుముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు అభ్యర్థించారు. కాగా తేజ్పాల్ క్రైం బ్రాంచ్ పోలీసులకు సహకరిస్తున్నారని, పోలీస్ కస్టడీ అవసరం లేదని అతని తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి శామా జోషీ ఆరు రోజులు పోలీస్ కస్టడీ విధించారు. మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపుల కేసులో తేజ్పాల్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement