రిపోర్టర్లు, యాంకర్లపై అభ్యంతర వ్యాఖ్యలు

Tamil Nadu BJP Leader Shares Facebook Post Abusing Women Journalists - Sakshi

చెన్నై: మహిళా జర్నలిస్టులపై అభ్యంతరకర వ్యాఖ్యలున్న ఓ పోస్ట్‌ను తమిళనాడు బీజేపీ నేత, నటుడు ఎస్వీ శేఖర్‌  గురువారం తన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. ‘చదువుకోని దుర్మార్గులు ఇప్పుడు మీడియాలో ఉన్నారు. విద్యా సంస్థల్లో కన్నా మీడియాలోనే లైంగికవేధింపులు ఎక్కువ. పెద్ద మనుషులతో పడుకోకుండా మీడియా సంస్థల్లో ఎవ్వరూ రిపోర్టర్లు, న్యూస్‌ యాంకర్లు కాలేరు. 

సీనియర్‌ జర్నలిస్ట్‌ లక్ష్మి సుబ్రమణియన్‌ను తాకినందుకు గవర్నర్‌ పురోహిత్‌ తన చేయిని ఫినాయిల్‌తో కడుక్కోవాలి. తమిళనాడులో నేరస్తులు, నీచులు, బ్లాక్‌ మెయిలర్ల చేతిలో చిక్కుకున్న మీడియా తిరోగమిస్తోంది. ఇక్కడి మీడియా ప్రతినిధులు దిగజారిన, అసహ్యమైన, సభ్యతలేని జీవులు’ అని ఉన్న పోస్ట్‌ను షేర్‌ చేశారు. తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో శేఖర్‌ వెంటనే క్షమాపణలు కోరారు. చదవకుండానే పోస్టును షేర్‌చేశానన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top