స్వీపర్‌ కొలువుకు ఎంబీఏ, బీటెక్‌ గ్రాడ్యూయేట్లు | In Tamil Nadu Assembly Engineers And MBA Students Apply For 14 Sweeper Jobs | Sakshi
Sakshi News home page

స్వీపర్‌ కొలువుకు ఎంబీఏ, బీటెక్‌ గ్రాడ్యూయేట్లు

Feb 6 2019 1:07 PM | Updated on Feb 6 2019 1:17 PM

In Tamil Nadu Assembly Engineers And MBA Students Apply For 14 Sweeper Jobs - Sakshi

చెన్నై : దేశంలో నిరుద్యోగం రాజ్యమేలుతుంది. లక్షల్లో యువత డిగ్రీలు, ఎంబీఏలు, బీటెక్‌లు చదివి.. కొలువుల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్‌ జారీ అయిన లక్షల్లో అప్లై చేస్తారు. చదివిన చదువుకు, కొలువుకు సంబంధం ఉండటం లేదు. ఆఖరికి స్వీపర్‌ పోస్టు కోసం వందల్లో పట్టభద్రులు అప్లై చేశారంటే.. నిరుద్యోగం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది.

వివరాలు.. తమిళనాడు అసెంబ్లీ సెక్రటేరియట్‌లో స్వీపర్‌, సానిటరీ కార్మికుల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. ఈ పోస్టులకు ఎంటెక్‌, బీటెక్‌, ఎంబీఏ, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్ల నుంచి వందల దరఖాస్తులు వచ్చి పడ్డాయి. వీరితో పాటు డిప్లామో పట్టా పొందిన వారు కూడా స్వీపర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 10 స్వీపర్‌ పోస్టులు, 4 శానిటరీ కార్మికుల పోస్టులకు గాను గత ఏడాది సెప్టెంబర్‌ 26న తమిళనాడు అసెంబ్లీ సెక్రటేరియట్‌ దరఖాస్తులను ఆహ్వానించింది. సంబంధిత విభాగంలో అనుభవం ఉంటే సరిపోతుందని పేర్కొంది.

దీంతో ఎంప్లాయిమెంట్‌ ఎక్సైంజ్‌తో సహా మొత్తం 4,607 దరఖాస్తులు అందాయి. వీరిలో డిగ్రీలు, ఎంబీఏలు, బీటెక్‌లు చదివిన వారు కూడా ఉన్నారు. ఇలా వచ్చిన దరఖాస్తుల్లో సరైన వివరాలు నమోదు చేయనందున దాదాపు 677 మంది దరఖాస్తులను సంబంధిత అధికారులు తిరస్కరించారు. స్వీపర్ ఉద్యోగాలకు కూడా డిగ్రీలు, పీజీలు చదివిన వారు అప్లై చేసుకోవడంతో... అధికారులు సైతం అవాక్కయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement