దూషించిన వ్యక్తికి సుష్మా సాయం

Sushma Swaraj Helps A Man Who Said She Is Not A Chowkidar - Sakshi

న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పరుష పదజాలంతో తనను దూషించిన వ్యక్తికి సాయం అందించేందుకు మంత్రి సుష్మాస్వరాజ్‌ సానుకూలత వ్యక్తం చేశారు. సకాలంలో పాస్‌పోర్టు అందక పోవడంతో తీవ్ర నిరాశకు లోనైన ఓ వ్యక్తి సుష్మా స్వరాజ్‌ను మీరు కాపలాదారు(చౌకీదార్‌) కాదంటూ దూషించారు. ఇందుకు స్పందించిన సుష్మా.. ‘మీ వ్యాఖ్యలకు కృతజ్ఞతలు. మా కార్యాలయం సిబ్బంది మిమ్మల్ని సంప్రదిస్తారు. మీకు పాస్‌పోర్టు అందేందుకు సాయపడతారు’ అంటూ బదులిచ్చారు. ‘సదరు వ్యక్తి మార్చి 13వ తేదీన అధికారులకు సాధారణ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాంట్లో అడ్రస్‌ ధ్రువీకరణ సరిగా లేదు. 20న అడ్రస్‌ ధ్రువీకరిస్తూ మరో పత్రం జత చేశారు. దీనిపై అంధేరీ పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది విచారణ జరిపారు. నివేదిక అందాల్సి ఉంది’ అంటూ వ్యక్తిగత కార్యదర్శి ఇచ్చిన సమాచారాన్ని కూడా ఆ పోస్ట్‌కు జత చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top