మహ్మద్ ఆరీఫ్ ఉరిశిక్ష అమలుపై సుప్రీం స్టే | supreme court stays Red Fort attack convict's death sentence | Sakshi
Sakshi News home page

మహ్మద్ ఆరీఫ్ ఉరిశిక్ష అమలుపై సుప్రీం స్టే

Apr 28 2014 1:03 PM | Updated on Sep 2 2018 5:20 PM

మహ్మద్ ఆరీఫ్ ఉరిశిక్ష అమలుపై సుప్రీం స్టే - Sakshi

మహ్మద్ ఆరీఫ్ ఉరిశిక్ష అమలుపై సుప్రీం స్టే

ఎర్రకోటపై దాడి కేసులో లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాది మహ్మద్ ఆరీఫ్ ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది.

న్యూఢిల్లీ :  ఎర్రకోటపై దాడి కేసులో లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాది మహ్మద్ ఆరీఫ్ ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది.  2000లో డిసెంబర్‌ 22వ తేదీన ఢిల్లీలోని ఎర్రకోట మీద దాడి కేసులో మహ్మద్‌ ఆరిఫ్‌ అలియాస్‌ అష్ఫాక్‌ ప్రధాన నిందితుడు. అష్ఫాక్  పాకిస్థాన్ దేశీయుడు. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు డబ్బు సాయం చేస్తున్న అంతర్జాతీయ హవాలా వ్యాపార ముఠాలో సభ్యుడు. కాగా ఎర్రకోటపై  ఆరుగురు తీవ్రవాదులు  విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఒక సాధారణ పౌరుడు మరణించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement