మహ్మద్ ఆరీఫ్ ఉరిశిక్ష అమలుపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ : ఎర్రకోటపై దాడి కేసులో లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాది మహ్మద్ ఆరీఫ్ ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. 2000లో డిసెంబర్ 22వ తేదీన ఢిల్లీలోని ఎర్రకోట మీద దాడి కేసులో మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ ప్రధాన నిందితుడు. అష్ఫాక్ పాకిస్థాన్ దేశీయుడు. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు డబ్బు సాయం చేస్తున్న అంతర్జాతీయ హవాలా వ్యాపార ముఠాలో సభ్యుడు. కాగా ఎర్రకోటపై ఆరుగురు తీవ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఒక సాధారణ పౌరుడు మరణించారు.