‘ఎలక్టోరల్‌ బాండ్స్‌’పై స్టే ఇవ్వం: సుప్రీం

Supreme Court refuses immediate stay on electoral bonds - Sakshi

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు నిధులను అందించే ‘ఎలక్టోరల్‌ బాండ్స్‌’ పథకంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. 2018లో ప్రారంభమైన ఈ పథకంపై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర స్టే విధించాలని కోరుతూ అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫారŠమ్స్‌(ఏడీఆర్‌) అనే స్వచ్చంధ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ సూర్యకాంత్‌ల ధర్మాసనం విచారణ జరిపింది.

స్టే విధించేందుకు నిరాకరించిన ధర్మాసనం రెండు వారాల్లోగా స్పందించాలని కేంద్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. నల్లధనాన్ని అధికార పార్టీకి అందించేందుకు ఈ పథకం ఉపయోగపడుతోందని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పథకం మరింత దుర్వినియోగమయ్యే అవకాశముందని ఏడీఆర్‌ తరఫు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పథకాన్ని అన్యాయంగా పునఃప్రారంభించారని ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల కోసం 10 రోజుల పాటు బాండ్స్‌ అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top