బడి ఎగ్గొట్టి మరీ బాగుచేశారు | Students Skipped School To Construct Road At Aurangabad | Sakshi
Sakshi News home page

బడి ఎగ్గొట్టి మరీ బాగుచేశారు

Jan 15 2020 3:40 AM | Updated on Jan 15 2020 1:11 PM

Students Skipped School To Construct Road At Aurangabad - Sakshi

స్వయంగా విద్యార్థులే ఓ రోజు బడికి డుమ్మా కొట్టి రోడ్డు బాగుచేసుకుని ఆదర్శంగా నిలిచారు.

ఔరంగాబాద్‌: రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో మహారాష్ట్రలోని ఓ గ్రామానికి ఉన్న బస్సు సౌకర్యం రద్దయింది. దీంతో స్వయంగా విద్యార్థులే ఓ రోజు బడికి డుమ్మా కొట్టి రోడ్డు బాగుచేసుకుని ఆదర్శంగా నిలిచారు. ఔరంగాబాద్‌ జిల్లా ధమన్‌గావ్‌రాజూర్‌లో జరిగిన ఈ ఘటన వివరాలివీ.. ధమన్‌గావ్‌రాజూర్‌కు 2019లో ముఖ్యమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన పథకం కింద 18 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని చేపట్టి, మధ్యలోనే వదిలేశారు.

అయితే ధమన్‌గావ్‌రాజూర్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దభాదీ గ్రామంలో స్కూలు ఉంది. ఆ స్కూల్లో ధమన్‌గావ్‌ రాజూర్‌ పిల్లలు చదువుకుంటున్నారు. అయితే రోడ్డు సరిగా లేక గతేడాది డిసెంబర్‌లో ఆ గ్రామానికి బస్సు సౌకర్యం  నిలిచిపోయింది. దీంతో ధమన్‌గావ్‌రాజూర్‌ విద్యార్థులు స్కూలుకు నడిచి వెళ్తున్నారు. రోజుకు రెండు గంటలపాటు నడకతోనే వారికి సరిపోతోంది. దీంతో విద్యార్థులు ఈ నెల 10న స్కూలు మానేసి కిలోమీటర్‌ మేర రోడ్డును బాగుచేసుకున్నారు. ‘ఈ రోడ్డును పూర్తిస్థాయిలో మార్చి నాటికి సిద్ధం చేస్తాము’అని రోడ్డు కాంట్రాక్టర్‌ వైకే దేశ్‌ముఖ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement