సోనియాకు ‘స్టేట్ రీ ఆర్గనైజేషన్’ బహూకరణ | state reorganization book presented to sonia gandhi | Sakshi
Sakshi News home page

సోనియాకు ‘స్టేట్ రీ ఆర్గనైజేషన్’ బహూకరణ

Dec 13 2014 1:25 AM | Updated on Nov 9 2018 5:41 PM

స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ ఏ కేస్ స్టడీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ పుస్తకాన్ని కాంగ్రెస్ ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మె ల్యే, ఏఐసీసీ కార్యదర్శి డా.చిన్నారెడ్డిలు సోనియాగాంధీకి అందజేశారు.

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమంలో 2004 వరకు జరిగిన పరిణామాలన్నింటినీ వివరిస్తూ వాయిస్ ఆఫ్ తెలంగాణ కన్వీనర్ డా. కెప్టెన్ పాండురంగారెడ్డి రాసిన ‘స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ ఏ కేస్ స్టడీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ పుస్తకాన్ని కాంగ్రెస్ ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మె ల్యే, ఏఐసీసీ కార్యదర్శి డా.చిన్నారెడ్డిలు సోనియాగాంధీకి అందజేశారు. శుక్రవారం టెన్ జన్‌పథ్‌లోని సోనియా నివాసంలో కలసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే చిన్నారెడ్డి, డాక్టర్ పాండురంగారెడ్డి విజయ్‌చౌక్‌లో మీడియాతో మాట్లాడారు.‘ కెప్టెన్ పాండురంగారెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చిన పీహెచ్‌డీ థీసిస్‌ని పుస్తక రూపంలోకి తెచ్చిన ‘స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ ఏ కేస్ స్టడీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ను సోనియాగాంధీకి అంకితమిచ్చారు. సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు అందజేయాలనుకున్నాం. బిజీగా ఉండడంతో శుక్రవారం కలిసి అందజేశాం’అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement