ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో సాంస్కృతికోత్సవాలు

SRM UNIVERSITY '' MILAN 2K18 ** VIJAY DEVARAKONDA @ FUN N JOY - Sakshi

చెన్నై:  నగరంలోని ఎస్‌ఆర్‌ఎం డీమ్డ్‌ యూనివర్సిటీలో మిలన్‌–2018 పేరుతో సాంస్కృతికోత్సవాలు బుధవారం ఘనంగా మొదలయ్యాయి. ఈ వేడుకల ప్రారంభ కార్యక్రమానికి అర్జున్‌ రెడ్డి చిత్ర హీరో విజయ్‌ దేవరకొండతోపాటు ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయ వ్యవస్థాపక చాన్స్‌లర్‌ టీఆర్‌ పారివేందర్, వైస్‌ చాన్స్‌లర్, రిజిస్ట్రార్‌ తదితరులు హాజరయ్యారు. మొత్తం ఐదు రోజులపాటు సాంస్కృతికోత్సవాలు జరగనుండగా తొలిరోజు దాదాపు 6,000 మంది వచ్చారనీ, వేడుకల్లో పాల్గొనేందుకు ఐదు ఖండాల్లోని 40 దేశాల నుంచి విద్యారంగ ప్రముఖులు ఇక్కడకు రానున్నారని నిర్వాహకులు తెలిపారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి మొత్తంగా రూ.15 లక్షల నగదును ఇవ్వనున్నట్లు చెప్పారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top