-
ఎస్ఆర్ఎం వర్సిటీలో సాంస్కృతికోత్సవాలు
చెన్నై: నగరంలోని ఎస్ఆర్ఎం డీమ్డ్ యూనివర్సిటీలో మిలన్–2018 పేరుతో సాంస్కృతికోత్సవాలు బుధవారం ఘనంగా మొదలయ్యాయి. ఈ వేడుకల ప్రారంభ కార్యక్రమానికి అర్జున్ రెడ్డి చిత్ర హీరో విజయ్ దేవరకొండతోపాటు ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయ వ్యవస్థాపక చాన్స్‌లర్ టీఆర్ పారివేందర్, వైస్ చాన్స్‌లర్, రిజిస్ట్రార్ తదితరులు హాజరయ్యారు. మొత్తం ఐదు రోజులపాటు సాంస్కృతికోత్సవాలు జరగనుండగా తొలిరోజు దాదాపు 6,000 మంది వచ్చారనీ, వేడుకల్లో పాల్గొనేందుకు ఐదు ఖండాల్లోని 40 దేశాల నుంచి విద్యారంగ ప్రముఖులు ఇక్కడకు రానున్నారని నిర్వాహకులు తెలిపారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి మొత్తంగా రూ.15 లక్షల నగదును ఇవ్వనున్నట్లు చెప్పారు. -
బిగుస్తున్న ఉచ్చు
ఎస్ఆర్ఎం విద్యా సంస్థల అధినేత పచ్చముత్తు పారివేందర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. ఒక్క మోసం కేసులే కాకుండా, మరెన్నో ఆరోపణలు తెరమీదకు వస్తున్నాయి. ఆ విద్యా సంస్థల స్థల వ్యవహారం మొదలు, బెదిరింపుల వ్యవహారాలపై విచారణ బృందం దృష్టి పెట్టే పనిలో పడ్డాయి. ఇక, తనకు పచ్చముత్తు, ఆయన వర్గీయుల నుంచి హత్యా బెదిరింపులు వస్తున్నట్టు ఓ సినీ ఫైనాన్షియర్ భద్రత కోసం పోలీసుల్ని శనివారం ఆశ్రయించారు. సాక్షి, చెన్నై: వేందర్ మూవీస్ మదన్ అదృశ్యం, సీట్ల పేరిట కోట్లు మోసం ఆరోపణల వ్యవహారాలు వెరసి విద్యా రంగంలో అందనంత ఎత్తులో ఉన్న ఎస్ఆర్ఎం అధిపతి పచ్చముత్తును కటకటాల పాలు చేశాయి. రిమాండ్‌కు కోర్టు ఆదేశాలు జారీచేయడంతో ఆయన్ను పుళల్ జైలుకు తరలించారు. అక్కడ ఆయనకు ప్రత్యేకంగా గదిని కేటాయించి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. జైలు నిబంధనల్ని ఉల్లంఘించి మరీ ఆయనకు ప్రత్యేకంగా అన్ని సౌకర్యాలు కల్పించినట్టు తమిళ మీడియాల్లో సైతం సమాచారాలు వెలువడ్డాయి. క్యాంటీన్ నుంచి ఆయనకు ఆహారం తీసుకొచ్చి ఇచ్చినట్టు, అలాగే, ఆయన ధరించి ఉన్న విగ్‌ను కూడా అలాగే వదలిపెట్టినట్టుగా సమాచారం. పుళల్‌లో ఉన్న ఆయన్ను తమ కస్టడీకి తీసుకుని విచారించేందుకు తగ్గ కసరత్తుల్ని నగర పోలీసులు వేగవంతం చేశారు. పచ్చముత్తు బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు రానున్న నేపథ్యంలో అదే రోజు ఆయన్ను తమ కస్టడీకి తీసుకునే విధంగా కోర్టును ఆశ్రయించేందుకు రెడీ అవుతున్నారు. ఈ తంతంగా ఓ వైపు సాగుతుంటే, మరో వైపు పచ్చముత్తు మీద గతంలో వచ్చిన ఆరోపణలు, అణగదొక్కబడ్డ వ్యవహారాలు మళ్లీ తెరమీదకు వస్తుండడంతో, వాటిని కూడా విచారణ పరిధిలోకి తీసుకొచ్చే రీతిలో కార్యాచరణ సిద్ధం అవుతున్నట్టు తెలిసింది. ఎస్ఆర్ఎం విద్యాసంస్థల స్థలానికి సంబంధించి పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, బాధితులు ఒక్కక్కరు తెరమీదకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. తమకు న్యాయం చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని, పోలీసుల్ని ఆశ్రయించేందుకు కాటాన్కొళత్తూరు పరిసరాల్లోని బాధితులు ఉరకలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు పచ్చముత్తు, ఆయన వర్గీయుల నుంచి హత్యా బెదిరింపులు వస్తున్నట్టు సినీ ఫైనాన్సియర్ ఒకరు కమిషనరేట్‌ను శనివారం ఆశ్రయించారు. సినిమాలకు ఫైనాన్స్ చేస్తూ వస్తున్న తనకు వేందర్ మూవీస్ రూపంలో తీవ్ర కష్టాలు ఎదురయ్యాయని, ప్రశ్నిస్తే, బెదిరింపులు వస్తున్నాయని, తనకు రక్షణ కల్పించాలంటూ కమిషనరేట్‌ను టీ నగర్‌కు చెందిన ముకుల్‌చంద్ ఫిర్యాదు చేయడం గమనించాల్సిన విషయం. ఇక,తమ నాయకుడ్ని అన్యాయంగా కేసుల్లో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే ఈ కుట్రలు అంటూ ఇండియ జననాయగ కట్చి వర్గాలు రెండోరోజులుగా పలుచోట్ల ఆందోళనకు దిగారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్‌కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్‌ను ఆశీర్వదించండి
Advertisement