భారత జాలర్ల అరెస్ట్‌.. బోట్లు స్వాధీనం | Sri Lanka Navy arrested tamil nadu fishermen | Sakshi
Sakshi News home page

భారత జాలర్ల అరెస్ట్‌.. బోట్లు స్వాధీనం

Jul 6 2017 2:41 PM | Updated on Sep 5 2017 3:22 PM

తమిళనాడుకు చెందిన ఎనిమిది మంది జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అరెస్ట్‌ చేశారు.

రామేశ్వరం: తమిళనాడుకు చెందిన ఎనిమిది మంది జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అరెస్ట్‌ చేశారు. శ్రీలంక ప్రాదేశిక జలాల్లో చేపల వేట కొనసాగిస్తున్నారన్న కారణంగా తమిళనాడుకు చెందిన ఎనిమిది మంది జాలర్లను బుధవారం శ్రీలంక నేవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి రెండు బోట్లు స్వాధీనం చేసుకున్నారు. కంకేసంతురై నేవీ క్యాంపునకు జాలర్లును తరలించినట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న జాలర్లు పుడుకొట్టై జిల్లా కొట్టాయిపట్టినానికి చెందిన వారని గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement