‘బ్రతిమాలడంతో వదిలేశారు.. లేదంటే హత్యే’ | Sikkim woman gangraped in moving car | Sakshi
Sakshi News home page

‘బ్రతిమాలడంతో వదిలేశారు.. లేదంటే హత్యే’

May 15 2017 10:44 AM | Updated on Sep 5 2017 11:13 AM

‘బ్రతిమాలడంతో వదిలేశారు.. లేదంటే హత్యే’

‘బ్రతిమాలడంతో వదిలేశారు.. లేదంటే హత్యే’

ఢిల్లీ-గుర్గావ్‌ సరిహద్దులో మరో నిర్భయలాంటి సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీకి వెళ్లి తన స్నేహితుడిని కలిసి ఇంటికి తిరిగొస్తున్న మహిళను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి కదులుతున్న కారులోనే లైంగికదాడికి పాల్పడ్డారు.

గురుగ్రామ్‌: ఢిల్లీ-గుర్గావ్‌ సరిహద్దులో మరో నిర్భయలాంటి సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీకి వెళ్లి తన స్నేహితుడిని కలిసి ఇంటికి తిరిగొస్తున్న మహిళను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి కదులుతున్న కారులోనే లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఓ నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి మరోమారు అక్కడ కూడా దాడికి దిగారు. దాదాపు ఐదుగంటలపాటు వారి వికృత క్రీడను కొనసాగించారు. అనంతరం ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించగా బాధితురాలు బ్రతిమాలుకోవడంతో ఓ రోడ్డు పక్కన వదిలేసి పారిపోయారు. ఈ ఘటన శనివారం వేకువ జామున చోటు చేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం 26 ఏళ్ల సిక్కింకు చెందిన మహిళ ఢిల్లీలోని కనౌట్‌ సమీపంలోని శాదారా ఏరియాలో ఉండే తన స్నేహితుడి ఇంటికి శుక్రవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో వెళ్లింది. అనంతరం అతడితో కలిసి ఢిల్లీలో రాత్రి 7.30 గంటల నుంచి 10.00గంటల మధ్య అతడితో కలిసి సినిమా చేసింది. ఆ తర్వాత 1.30 నుంచి 2గంటల ప్రాంతంలో తన స్నేహితుడు ఆమె కలిసి ఓ క్యాబ్‌ తీసుకొని గుర్గావ్‌కు బయలుదేరి వచ్చారు. ఇంటికి కొద్ది దూరంలో ఆమెను దించి స్నేహితుడు వెళ్లిపోగా స్విప్ట్‌ కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను బలవంతంగా కారులోకి లాగేసి ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు.

అనంతరం 6.30గంటల ప్రాంతంలో ఆమెను వదిలేయగా ఓ బైకిస్టు సహాయంతో తిరిగి ఢిల్లీకి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక దాడికి పాల్పడే ఇద్దరు వ్యక్తులు మాత్రం మూడో వ్యక్తిని దీపక్‌ అని పిలిచారని చెప్పింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరిస్తున్నామన్నారు. త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement