శౌరిపై కోర్టు ధిక్కార అభియోగాల ఉపసంహరణ | Shourie on the withdrawal of the charges of contempt of court | Sakshi
Sakshi News home page

శౌరిపై కోర్టు ధిక్కార అభియోగాల ఉపసంహరణ

Jul 24 2014 2:21 AM | Updated on Sep 2 2018 5:20 PM

శౌరిపై కోర్టు ధిక్కార అభియోగాల ఉపసంహరణ - Sakshi

శౌరిపై కోర్టు ధిక్కార అభియోగాల ఉపసంహరణ

పాత్రికేయుడు అరుణ్‌శౌరిపై 24 ఏళ్ల క్రితం నమోదైన కోర్టు ధిక్కార అభియోగాలను సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. 1990లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డేపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి అప్పటి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి నే

న్యూఢిల్లీ: ప్రముఖ పాత్రికేయుడు అరుణ్‌శౌరిపై 24 ఏళ్ల క్రితం నమోదైన కోర్టు ధిక్కార అభియోగాలను సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. 1990లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డేపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి అప్పటి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో ఏర్పాటైన ఏకసభ్యకమిటీకి వ్యతిరేకంగా అరుణ్‌శౌరి కథనం రాశారు. దీనిపై బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీం కోర్టు సైతం అరుణ్‌శౌరిపై సుమోటోగా కోర్టు ధిక్కార అభియోగాలు నమోదు చేసింది. బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ.. 1952 చట్టం ప్రకారం ఏర్పాటైన కమిషన్‌ను కోర్టుగా పరిగణించలేమని అది కోర్టు ధిక్కారం కిందకు రాదని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement