షారుక్కు దన్నుగా శివసేన! | 'Shouldn't target Shah Rukh Khan for being Muslim': Shiv Sena | Sakshi
Sakshi News home page

షారుక్కు దన్నుగా శివసేన!

Nov 4 2015 4:17 PM | Updated on Mar 29 2019 9:31 PM

షారుక్కు దన్నుగా శివసేన! - Sakshi

షారుక్కు దన్నుగా శివసేన!

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్కు శివసేన పార్టీ దన్నుగా నిలిచింది. ఒక ముస్లిం అయినందున షారుక్ ఖాన్ పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడం సరికాదని శివసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

ముంబయి: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్కు శివసేన పార్టీ దన్నుగా నిలిచింది. ఒక ముస్లిం అయినందున షారుక్ ఖాన్ పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడం సరికాదని శివసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బుధవారం ఏకధాటిగా షారుక్ పై పలు రకాల విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో పై విధంగా శివసేన వ్యాఖ్యానించింది.

షారుక్ భారత్లో ఉంటున్నా ఆయన మనసంతా పాకిస్థాన్లోనే ఉంటుందని మధ్యప్రదేవ్ ఎమ్మెల్యే బీజేపీ నేత కైలాశ్ విజయ్ వర్గియా, షారుక్ భాష, పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ భాష ఒకటేనని బీజేపీ ఎంపీ యోగి ఆదిత్య నాథ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ముస్లిం అని పక్షపాతంతో ఓ నటుడిపై విమర్శలు చేయడం సమంజసం అనిపించుకోదని వ్యాఖ్యానించింది.

Advertisement
 
Advertisement
Advertisement