బీజేపీ పతనానికి నాంది : శశి థరూర్‌ | Shashi Tharoor Says It Was The Beginning Of The End For Bjp On Poll Survey | Sakshi
Sakshi News home page

బీజేపీ పతనానికి నాంది : శశి థరూర్‌

Aug 14 2018 10:15 AM | Updated on Aug 14 2018 10:15 AM

Shashi Tharoor Says It Was The Beginning Of The End For Bjp On Poll Survey - Sakshi

కాషాయ పార్టీకి మింగుడుపడని సర్వే..

సాక్షి, న్యూఢిల్లీ : మూడు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం ఎదురవుతుందన్న సర్వే అంచనాల నేపథ్యంలో కాషాయ పార్టీ పతనానికి ఇది నాంది అని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ వ్యాఖ్యానించారు. రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించి అధికార పగ్గాలు చేపడుతుందని ఏబీపీ న్యూస్‌ సీ ఓటర్‌ సర్వే వెల్లడించిన విషయం తెలిసిందే.

తాజా సర్వేతో కాం‍గ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది. అయితే ఇదే సర్వే ప్రధాని పదవికి ఇప్పటికీ నరేంద్ర మోదీయే సరైన వ్యక్తని పెద్దసంఖ్యలో ప్రజలు అభిప్రాయపడుతున్నట్టు పేర్కొనడం గమనార్హం. కాగా రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌లో పాలక బీజేపీపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతే కాంగ్రెస్‌ పార్టీకి కలిసివస్తున్నదని సర్వే పసిగట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement