నా దగ్గర జాతీయ అవార్డు లేదు: షారుక్ | Shah Rukh comment on intolerance | Sakshi
Sakshi News home page

నా దగ్గర జాతీయ అవార్డు లేదు: షారుక్

Nov 3 2015 8:23 AM | Updated on Sep 3 2017 11:54 AM

నా దగ్గర జాతీయ అవార్డు లేదు: షారుక్

నా దగ్గర జాతీయ అవార్డు లేదు: షారుక్

సృజన, మతాలపై అసహనం దేశానికి హానికరమని బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ అన్నారు. సోమవారం తన 50వ పుట్టినరోజు

అసహనంపై షారుక్ వ్యాఖ్య
 
 ముంబై: సృజన, మతాలపై అసహనం దేశానికి హానికరమని బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ అన్నారు. సోమవారం తన 50వ పుట్టినరోజు సందర్భంగా కింగ్‌ఖాన్.. ప్రస్తుతం దేశంలో తీవ్ర అసహనం నెలకొందన్నారు. సినీరంగానికి చెందిన వారు, శాస్త్రవేత్తలు, రచయితలు అవార్డులు వెనక్కి ఇవ్వడాన్ని సమర్థించారు. వెనక్కి ఇవ్వడానికి తనకు జాతీయ ఫిల్మ్ అవార్డు ఏమీ లేనప్పటికీ, అలా చేసిన సినీ ప్రముఖులు దివాకర్ బెనర్జీ, ఆనంద్ పట్వర్ధన్‌ల నిర్ణయాన్ని తాను గౌరవిస్తానన్నారు. సృజన పట్ల, మతం పట్ల అసహనం ప్రదర్శిస్తున్నామంటే  దేశం వేసిన ప్రతి ముందడుగు మనం వెనక్కి లాగుతున్నట్లేనన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement