సెక్స్ రాకెట్లో.. డేరా బాబా శిష్యుడు | Sex racket of Gurmeet Ram Rahims follower busted | Sakshi
Sakshi News home page

సెక్స్ రాకెట్లో.. డేరా బాబా శిష్యుడు

Jan 6 2018 2:19 PM | Updated on Jul 23 2018 8:49 PM

Sex racket of Gurmeet Ram Rahims follower busted - Sakshi

న్యూఢిల్లీ : అత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ శిష్యుడొకరు పశ్చిమ బెంగాల్లో సెక్స్ రాకెట్ నడుపుతూ పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. పశ్చిమ బెంగాల్ లో ప్రమోద్ సింఘానియా తనకు చెందిన ఓ బిల్డింగ్లో వేశ్య గృహాలను నడుపుతున్నాడు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి పలువురిని అరెస్ట్ చేశారు.

పోలీసులు రావడం గమనించిన ఇంటియజమాని, నిందితుడు ప్రమోద్ సింఘానియా ప్రత్యేకంగా నిర్మించిన సొరంగమార్గం గుండా తప్పించుకున్నాడు. సొరంగం కనిపించకుండా  నిర్మించిన చెక్క డోర్ పై దుస్తులు కప్పి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. చెక్కలతో నిర్మించిన 25 క్యాబిన్లను బిల్డింగ్లోని ఓ అంతస్తులో పోలీసులు కనుగొన్నారు. అందులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించారు.

దాడులకు కొద్దిసేపటి ముందు అక్కడే ఉన్న మైనర్ బాలికలు, సింఘానియా తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. మరికొందరు మైనర్ బాలురు, బాలికలను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మురం చేశామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement