‘మూకదాడులపై నిర్లక్ష్యం’

SC slams social media sites for promoting content leading to lynching - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో వరసగా వెలుగుచూస్తున్న మూకదాడులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్‌ మీడియాలో బూటకపు వార్తలు, విద్వేషపూరిత సందేశాలతో ప్రభావితులై వ్యక్తులను కొట్టి చంపుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆక్షేపించింది. లైంగిక నేరాల వీడియోలు సోషల్‌ మీడియాలో వ్యాప్తి చెందకుండా నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్, జస్టిస్‌ యూయూ లలిత్‌ల బెంచ్‌ శుక్రవారం పైవిధంగా స్పందించింది. ‘ఈ మధ్య సోషల్‌ మీడియా వేదికగా చాలా జరుగుతున్నాయి. ప్రజలు చనిపోతున్నా ఎవరూ పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. కోర్టు ఉత్తర్వులకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. ప్రజలు కూడా ఇదే ఆశిస్తున్నారు’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top