అయోధ్య కేసు విచారణ మార్చి 5కి వాయిదా

Sc Defers Ayodhya Case Hearing To March Fifth - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య కేసుకు సంబంధించి సర్వోన్నత న్యాయస్ధానంలో తదుపరి విచారణ మార్చి 5కి వాయిదా పడింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన కేసులో సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.  సుప్రీం కోర్టులో  మంగళవారం తొలుత విచారణ ప్రారంభమైన వెంటనే కేసుకు సంబంధించి సెక్రటరీ జనరల్‌, నలుగురు రిజిస్ర్టార్లు సంతకం చేసిన పత్రాలను ఆయా పార్టీలన్యాయవాదులకు అందచేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాన న్యాయయూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ వెల్లడించారు.

కేసు విచారణ ప్రారంభమైన తర్వాత అనువాద పత్రాలు అర్ధం కావడం లేదనే సాకుతో పత్రాల అనువాదం​ సరిగా లేదంటూ విచారణలో జాప్యం జరిగేలా ఏ ఒక్క ఫిర్యాదు లేకుండా వ్యవహరించాలని తాము భావిస్తున్నామన్నారు. కాగా యూపీ ప్రభుత్వం సమర్పించిన అనువాద ప్రతాలను తాము పరిశీలించలేదని ముస్లిం పార్టీలతరపు న్యాయవాది, సీనియర్‌ అడ్వకేట్‌ రాజీవ్‌ ధవన్‌ స్పష్టం చేశారు. డాక్యుమెంట్ల పరిశీలనకు 8 నుంచి 12 వారాల సమయం అవసరమవుతుందని సీనియర్‌ అడ్వకేట్‌ దుష్యంత్‌ దవే స్పష్టం చేశారు.

మరోవైపు అయోధ్య కేసులో భిన్న పార్టీల  మధ్య ఏమాత్రం అవకాశం ఉన్నా మధ్యవర్తిత్వం నెరిపేందుకు కోర్టు ప్రయత్నిస్తుందని జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే అన్నారు. ఇది ప్రైవేట్‌ ఆస్తి వ్యవహరాం కాదని, కరుడుగట్టిన వివాదాస్పద అంశమని, ఒక శాతం ఛాన్స్‌ ఉన్నా అందరికీ ఆమోదయోగ్య పరిష్కారానికి చొరవ చూపుతామని పేర్కొన్నారు. ఈ అంశంపై మధ్యవర్తితం సాధ్యమయ్యే పనికాదని, గతంలో పలుసార్లు ప్రయత్నించి విఫలమైన విషయాన్ని సీనియర్‌ న్యాయవాదులు సీఎస్‌ వైద్యనాధన్‌, రంజిత్‌ కుమార్‌లు గుర్తుచేశారు. న్యాయమూర్తులే దీనికి సరైన పరిష్కారం చూపుతూ వివాదానికి తెరదించాలని విజ‍్క్షప్తి చేశారు. కాగా శ్రీరాముడు జన్మస్ధలమైన అయోధ్యలో హిందువులు పూజలు చేసుకునే హక్కును పరిరక్షించేలా రాజీ కుదరాలని రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top