రాఫెల్‌ డీల్‌ : జేపీసీ విచారణకు అఖిలేష్‌ డిమాం‍డ్‌ | Sakshi
Sakshi News home page

రాఫెల్‌ డీల్‌ : జేపీసీ విచారణకు అఖిలేష్‌ డిమాం‍డ్‌

Published Sun, Sep 23 2018 5:28 PM

 Samajwadi Party Chief Akhilesh Demands JPC Probe On Rafale Deal - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్‌ ఒప్పందంపై పెనుదుమారం రేగుతున్న క్రమంలో ఈ డీల్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణకు ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. భారత్‌- ఫ్రాన్స్‌ మధ్య జరిగిన ఈ ఒప్పందం అంతర్జాతీయ స్ధాయిలో రచ్చకెక్కడంతో జేపీసీ విచారణ జరిపిస్తేనే ఒప్పందంలోని అంశాలు వెలుగుచూస్తాయని చెప్పారు.

రాఫెల్‌ ఒప్పందంలో భారత ప్రభుత్వ సూచనతోనే అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ డిఫెన్స్‌ను భాగస్వామిగా చేర్చుకున్నట్టు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాన్సిస్‌ హోలాండ్‌ స్పష్టం చేయడంతో ఈ ఒప్పందం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.

హోలాండ్‌ ప్రకటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస​ చీఫ్‌ రాహుల్‌ గాంధీ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దేశ ప్రధాని దొంగ, అవినీతిపరుడని రాహుల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement