ప్రయాణీకుల భద్రతే అత్యంత ప్రాధాన్యత అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ అన్నారు.
ప్రయాణీకుల భద్రతే తొలి ప్రాధాన్యత: సదానంద
May 27 2014 1:04 PM | Updated on Sep 2 2017 7:56 AM
న్యూఢిల్లీ: ప్రయాణీకుల భద్రతే అత్యంత ప్రాధాన్యత అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ అన్నారు. మంగళవారం ఉదయం రైల్వేశాఖ మంత్రిగా బాధ్యతల్ని స్వీకరించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రైల్వేశాఖలో ఎన్నో సవాళ్లు ముందున్నాయి. కాని ప్రయాణీకులను సురక్షితంగా గ్యమ్యానికి చేర్చడమే ప్రథమ కర్తవ్యం అని అన్నారు.
సదానంద గౌడ ప్రమాణ స్వీకారం చేపట్టడానికి కొద్ది గంటల ముందే ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు వెళుతున్న రైలు చౌరేబ్ స్టేషన్ వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణీకులు మృతి చెందారు. గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ రైలు సంత్‌కబీర్‌నగర్ జిల్లా చౌరేబ్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పి గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement