'ఎనిమిదిన్నర లక్షల కోట్లు ఖర్చు చేస్తాం' | Rs.8.5 lakh crore to be spent on railway overhaul: Minister | Sakshi
Sakshi News home page

'ఎనిమిదిన్నర లక్షల కోట్లు ఖర్చు చేస్తాం'

Jan 13 2016 6:24 PM | Updated on Sep 3 2017 3:37 PM

రానున్న ఐదేళ్లలో మొత్తం భారతీయ రైల్వే వ్యవస్థనే సమూలంగా మార్చి వేస్తామని కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా అన్నారు.

అగర్తల: రానున్న ఐదేళ్లలో మొత్తం భారతీయ రైల్వే వ్యవస్థనే సమూలంగా మార్చి వేస్తామని కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా అన్నారు. భారతీయ రైల్వేపై ఐదేళ్లలో రూ.8.5లక్షల కోట్లు ఖర్చుచేస్తామని ఆయన తెలిపారు. బుధవారం అసోం-అగర్తల మధ్య కొత్తగా నిర్మించిన బ్రాడ్ గేజ్ ట్రయల్ రైలును ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రయల్ రన్ పూర్తయిన తర్వాత అవసరమైన అన్ని అనుమతులు తీసుకొని అధికారికంగా ఈ మార్గంలో రైలు సర్వీసులు ప్రారంభిస్తామని చెప్పారు. బంగ్లా సరిహద్దును పంచుకునే త్రిపుర రైలు మార్గాన్ని ప్రారంభించి త్వరలోనే డిసెంబర్ 2017నాటికి పూర్తి చేస్తామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement