హత్యకేసులో రాఖీ యాదవ్కు బెయిల్ | Rocky Yadav, son of suspended JD(U) MLC Manorama Devi and accused of killing teenager was granted bail by Patna High Court | Sakshi
Sakshi News home page

హత్యకేసులో రాఖీ యాదవ్కు బెయిల్

Oct 20 2016 1:16 PM | Updated on Sep 4 2017 5:48 PM

జేడీయూ బహిష్కృత ఎమ్మెల్సీ మనోరమ దేవి కుమారుడు రాకీ యాదవ్కు బెయిల్ లభించింది.

పట్నా: టీనేజ్ యువకుడు హత్య కేసులో జేడీయూ బహిష్కృత ఎమ్మెల్సీ మనోరమ దేవి కుమారుడు రాకీ యాదవ్కు బెయిల్ లభించింది. పట్నా హైకోర్టు గురువారం అతడికి బెయిల్ మంజూరు చేసింది. తన కారును ఓవర్ టేక్ చేశాడన్న అక్కసుతో ఆదిత్య సచ్దేవ్ అనే యువకుడిని రాకీ యాదవ్ కాల్చి చంపిన విషయం తెలిసిందే.

మరోవైపు రాకీ యాదవ్కు బెయిల్ మంజూరు చేయటంపై మృతుడి తండ్రి శ్యాం సుందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. డబ్బు, అధికారంతో మరిసారి వాస్తవాలు మరుగునపడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ న్యాయం మాత్రం జరగలేదన్నారు. బిహార్కు ఇది చెడ్డరోజు అని శ్యాంసుందర్ అభివర్ణించారు. జంగిల్ రాజ్ నుంచి బిహార్ ను రక్షించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement