ఔను! నేనే కాల్చి చంపాను! | Rocky confesses that he fired at Aditya Sachdev | Sakshi
Sakshi News home page

ఔను! నేనే కాల్చి చంపాను!

May 14 2016 8:32 AM | Updated on Jul 18 2019 2:02 PM

ఔను! నేనే కాల్చి చంపాను! - Sakshi

ఔను! నేనే కాల్చి చంపాను!

బిహార్‌లో సంచలనం సృష్టించిన ఆదిత్య సచ్‌దేవ్‌ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.

పట్నా: బిహార్‌లో సంచలనం సృష్టించిన ఆదిత్య సచ్‌దేవ్‌ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆదిత్యను తానే కాల్చిచంపినట్టు నిందితుడు, ఎమ్మెల్సీ మనోరమా దేవి కొడుకు రాకీ కుమార్ యాదవ్ ఒప్పుకొన్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.

తన వాహనాన్ని దాటిపోయాడన్న కోపంతో రాకీకుమార్ యాదవ్‌.. ఆదిత్య సచ్‌దేవ్‌ అనే యువకుడిని కాల్చి చంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే రాకీని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో అతన్ని విచారిస్తున్నారు. ఈ విచారణలో ఆదిత్యను తానే కాల్చి చంపానని రాకీ అంగీకరించడాని బిహార్ పోలీసుశాఖకు చెందిన అత్యంత ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement