పాకిస్తాన్ కోరితే సహాయం: రాజ్‌నాథ్ సింగ్ | Ready to Help Pakistan Root Out Terrorists | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్ కోరితే సహాయం: రాజ్‌నాథ్ సింగ్

Oct 15 2016 4:03 AM | Updated on Sep 4 2017 5:12 PM

పాకిస్తాన్ కోరితే సహాయం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్తాన్ కోరితే సహాయం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్తాన్ ప్రభుత్వం కోరితే ఆ దేశంలో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు అన్ని రకాల సహాయ సహకారాలందించడానికి భారత్ సిద్ధంగా ఉంద ని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు

సాక్షి, బెంగళూరు: పాకిస్తాన్ ప్రభుత్వం కోరితే ఆ దేశంలో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు అన్ని రకాల సహాయ సహకారాలందించడానికి భారత్ సిద్ధంగా ఉంద ని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. శుక్రవారం బెంగళూరులోని నేషనల్ కళాశాల మైదానంలో నిర్వహించిన బీజేపీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజ్‌నాథ్ ఉడీ ఉగ్ర దాడి, సర్జికల్ స్ట్రైక్ అంశాలను ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్‌ను  ప్రపంచ దేశాలు దూరంగా పెడుతున్నాయన్నారు. పాక్‌తో మంచి సంబంధాలను నెలకొల్పుకోవాలని భారత్ ప్రయత్నిస్తోందని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement