‘అవి బుద్ధిలేని వ్యాఖ్యలు’ | Sakshi
Sakshi News home page

‘అవి బుద్ధిలేని వ్యాఖ్యలు’

Published Wed, Nov 15 2017 4:32 PM

Ram Madhav slams Farooq Abdullah - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆక్రమిత కశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌కు అనుకూలగా వ్యాఖ్యలు చేసిన జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లాపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ మండిపడ్డారు. పీఓకే విషయంలో ఫరూఖ్‌ అబ్దుల్లా తన అభిప్రాయాలు మార్చుకోవడం.. చాలా దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఫరూఖ్‌ అబ్దుల్లాపై బీహార్‌లో రాజద్రోహం కేసు నమోదైంది. జమ్మూ కశ్మీర్‌, పాకిస్తాన్‌ ఆధీనంలో ఉన్న ప్రాంతం పూర్తిగా భారత్‌కు చెందినదేని రామ్‌ మాధవ్ స్పష్టం చేశారు.

ఫరూఖ్‌ అబ్దుల్లాకు మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నారని రామ్‌మాధవ్‌ అన్నారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని.. ఈ ప్రాంతాన్ని వెంటనే పాకిస్తాన్‌ ఖళీ చేయాలని భారత పార్లమెంట్‌ 1994 ఫిబ్రవరి 22న ఏకగ్రీవ తీర్మానం చేసిందని రామ్‌మాధవ్‌ గుర్తు చేశారు. భారతీయ జనతాపార్టీ, భారత్‌ ఈ తీర్మానికే కట్టుబడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్‌, ఆక్రమిత కశ్మీర్‌లు భారత్‌లో అంతర్భాగమని రామ్‌మాధవ్‌ ప్రకటించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement