మిలటరీ టోపీ తీసేశారు! | Rajya Sabha Marshals Abandon The Tradition Of Wearing Military Caps | Sakshi
Sakshi News home page

మిలటరీ టోపీ తీసేశారు!

Nov 22 2019 10:38 AM | Updated on Nov 22 2019 10:38 AM

Rajya Sabha Marshals Abandon The Tradition Of Wearing Military Caps - Sakshi

న్యూఢిల్లీ: రాజ్యసభ మార్షల్స్‌ గురువారం ఎలాంటి టోపీలు ధరించకుండానే సభలో కనిపించారు. మార్షల్స్‌ కొత్త యూనిఫాంపై పలు పార్టీలు, మాజీ సైనికాధికారుల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ మార్పు చోటుచేసుకోవడం గమనార్హం. గురువారం సభలో కొందరు ప్రతిపక్ష సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించగా రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. ‘బుధవారం చెప్పినట్లుగానే మార్షల్స్‌ డ్రెస్‌పై సమీక్ష చేస్తున్నాం. ఆర్మీ మాదిరిగా వారి యూనిఫాం ఉండదు’అని పేర్కొన్నారు. భారతీయ సంప్రదాయ తలపాగాకు బదులుగా ‘సైనిక’ తరహా  యూనిఫాంను తేవడం తెల్సిందే. 
 

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement