రైల్వే నియామక ప్రక్రియ సమయం తగ్గింపు

Railway may shorten recruitment process from two years to six months - Sakshi

న్యూఢిల్లీ: రైల్వే నియామక ప్రక్రియను రెండేళ్ల నుంచి 6 నెలలకు తగ్గించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేపట్టింది. గత నెల 24న వాస్కో–డి–గామా–పట్నా ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన అనంతరం రైల్వే బోర్డు చైర్మన్‌ అశ్వని లోహాని ఆధ్వర్యంలో జనరల్‌ మేనేజర్ల సమావేశం జరిగింది. ‘రైల్వే ఉద్యోగాల ప్రక్రియ సుదీర్ఘంగా ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ నుంచి ఉద్యోగం రావడానికి అభ్యర్థులకు కనీసం రెండేళ్లు పడుతుంది. దీంతో అనేకమంది వేరే ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారు. ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించడం ద్వారా నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఈశాన్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ చాహాతే రామ్‌ ప్రతిపాదన చేశారు. దీంతో ఆరు నెలల్లోపు నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు తమ అభిప్రాయాన్ని డిసెంబర్‌ 20లోగా తెలియజేయాలని లోహాని రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డును కోరారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top