రాహుల్ వచ్చారు.. మీటింగ్ పెడుతున్నారు | Rahul Gandhi back from Europe, will hold meeting with Congress leaders today | Sakshi
Sakshi News home page

రాహుల్ వచ్చారు.. మీటింగ్ పెడుతున్నారు

Jan 11 2016 9:12 AM | Updated on Mar 18 2019 9:02 PM

రాహుల్ వచ్చారు.. మీటింగ్ పెడుతున్నారు - Sakshi

రాహుల్ వచ్చారు.. మీటింగ్ పెడుతున్నారు

యూరప్ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ భారత్ తిరిగి వచ్చారు.

న్యూఢిల్లీ: యూరప్ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ భారత్ తిరిగి వచ్చారు. ఆయన సోమవారం పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటుచేశారు. తాను యూరప్ పర్యటనలో ఉండగా జరిగిన పరిణామాలేమిటి అన్నదానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. గతంలో రాహుల్గాంధీ విదేశీ పర్యటనలపై తీవ్ర ఊహాగానాలు చెలరేగిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో డిసెంబర్ 28న తాను యూరప్ పర్యటనకు వెళ్తున్నట్టు ఆయన ట్విట్టర్లో ప్రకటించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి.. ఆయన కొత్త సంవత్సరాన్ని విదేశాల్లో జరుపుకొన్నారు. గత ఏడాది కూడా ఆయన కొత్త సంవత్సర వేడుకల్ని విదేశాల్లోనే జరుపుకొన్నారు. అప్పట్లో ఏఐసీసీ సదస్సుకు కూడా ఆయన హాజరుకాకపోవడంతో బీజేపీ రాహుల్ పై, కాంగ్రెస్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement