దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య వెనుక అసలు నిజాలను సమాధి చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలూ
తల్లి రాధికా వేముల ఆరోపణ
సాక్షి, బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య వెనుక అసలు నిజాలను సమాధి చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలూ కుతంత్రాలకు పాల్పడుతున్నాయని రోహిత్ తల్లి రాధికా వేముల ఆరోపించారు. శనివారం బహుజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బెంగళూరులో నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దళితులను సమాజం నుంచి వేరు చేస్తోందని ఆరోపించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నిజంగా దళితుల అభివృద్ధి కోసం పాటుపడుతుంటే రోహిత్ ఆత్మహత్య వెనుక నిజాలను ప్రపంచానికి తెలియజేయాలని డిమాండ్ చేశారు.