లోదుస్తులపైనా ఆ స్కూల్‌ ఆదేశాలు..

Pune school issues directive on colour of innerwear for girl students - Sakshi

సాక్షి, ముంబై : పూణేకు చెందిన విశ్వశాతి గురుకుల్‌ విద్యా సంస్థ జారీ చేసిన ఉత్తర్వులు కలకలం రేపుతున్నాయి. బాలికల లోదుస్తుల రంగుపై స్కూల్‌ అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఇచ్చిన డైరీల్లో బాలికలు తెలుపు రంగు లోదుస్తులు మాత్రమే వేసుకోవాలని నిర్ధిష్టంగా పేర్కొన్నారు. స్కూల్‌ యాజమాన్యం తమను బలవంతంగా ఈ ప్రతిపాదనకు ఒప్పించేలా ఇలా వ్యవహరిస్తోందని తల్లితండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మార్గదర్శకాలపై పలువురు తల్లితండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే వీటిని తోసిపుచ్చుతున్న స్కూల్‌ యాజమాన్యం బాలికల భద్రత కోసమే ఈ నియమాలను పొందుపరిచామని సమర్ధించుకుంటోంది. వివాదాస్పద మార్గదర్శకాలపై తల్లితండ్రులు స్కూల్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. మరోవైపు ఈ నియమాలను వ్యతిరేకిస్తూ ప్రాధమిక విద్య డైరెక్టర్‌ను తల్లితండ్రులు కలిసి స్కూల్‌ తీరుపై ఫిర్యాదు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top