మహిళా పైలట్‌కు ప్రియాంక ప్రశంస  | Priyanka Gandhi Vadra Praises Chopper Pilot | Sakshi
Sakshi News home page

మహిళా పైలట్‌కు ప్రియాంక ప్రశంస 

Apr 17 2019 4:04 AM | Updated on Aug 27 2019 4:45 PM

Priyanka Gandhi Vadra Praises Chopper Pilot - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా ట్విట్టర్‌లో ఓ పైలట్‌ ఫొటోను పోస్టు చేసి పొగడ్తల వర్షం కురిపించారు. అదేంటి పైలట్‌ ఫొటోను పోస్టు చేసి అంతలా పొగడాల్సిన అవసరం ఏంటని అనుకుంటున్నారా..? ఎందుకంటే ఆమె పోస్టు చేసిన ఆ పైలట్‌ ఓ మహిళ కావడమే దీనికి కారణం. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫతేపూర్‌ సిక్రీకి ప్రియాంక హెలికాప్టర్‌లో బయలుదేరారు. అయితే ఆ హెలికాప్టర్‌ను నడుపుతున్నది ఓ మహిళా పైలట్‌ కావడంతో ఆనందపడిన ఆమె.. మహిళా పైలట్‌తో సెల్ఫీ దిగారు. తర్వాత ఆ ఫొటో ట్వీట్‌చూస్తూ ‘ఓ మహిళ నడుపుతున్న హెలికాప్టర్‌లో ప్రయాణించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. మహిళలను ప్రియాంక పొగడటం ఇదేం మొదటిసారి కాదు. ఆమె తొలి రాజకీయ ప్రసంగంలో సోదరసోదరీమణులకు బదులుగా.. సోదరీసోదరులకు అంటూ వ్యాఖ్యానించారు.  

Advertisement
 
Advertisement
Advertisement