థాంక్యూ నవీన్‌...సీఎంకు ప్రధాని ఫోన్‌

Prime Minister Phone Call To Naveen Patnaik - Sakshi

భువనేశ్వర్‌ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌లు ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు కృతజ్ఞతలు తెలియ జేశారు. శుక్రవారం ఫోన్‌ ద్వారా  ఈ ఇద్దరు నాయకులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలపడం విశేషం. ఇటీవల ముగిసిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికలో ఈ ఇద్దరు  నాయకులు ఎన్డీఏ ప్రతిపాదిత అభ్యర్థికి మద్దతుగా నిలవాలని అభ్యర్థించిన విషయం తెలిసిందే.

జనతా దళ్‌ (యు) అభ్యర్థిని ఎన్డీఏ ప్రతిపాదిత అభ్యర్థిగా బరిలోకి దింపారు. ఆయనకు బిజూ జనతా దళ్‌ కూడా మద్దతు ఇచ్చింది. ఆయన విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా ఎన్డీఏకి నేతృత్వం వహిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, జనతా దళ్‌ (యు) అధినేత నితీష్‌కుమార్‌లు బిజూ జనతా దళ్‌ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌కు  కృతజ్ఞతలు తెలియజేశారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top