పోలీస్‌ అమరవీరులకు మోదీ నివాళి

PM Narendra Modi Pays Homage To Slain Policemen - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పునరుద్ధరించిన నేషనల్‌ పోలీస్‌ మెమోరియల్‌ను జాతికి అంకితం చేశారు. విధినిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు ఘనంగా నివాళులు అర్పించారు. 1959లో లడఖ్‌ ప్రాంతంలో చైనా దళాలు పదిమంది పోలీసులను పొట్టనబెట్టుకున్న క్రమంలో అక్టోబర్‌ 21న జాతీయ పోలీసు దినోత్సవంగా జరుపుతున్న విషయం తెలిసిందే.

ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని దేశానికి స్వాతంత్యం లభించినప్పటి నుంచి పోలీసుల త్యాగాలను కొనియాడారు. పోలీస్‌ మెమోరియల్‌ను ప్రారంభించే ముందు ప్రధాని మోదీ, ఇతర నేతాలు పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలో పోలీస్‌ మెమోరియల్‌ను ఏర్పాటు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top