పాక్ ఉగ్రదాడిని ఖండించిన మోదీ | pm modi condemns peshawar attack | Sakshi
Sakshi News home page

పాక్ ఉగ్రదాడిని ఖండించిన మోదీ

Dec 16 2014 4:19 PM | Updated on Aug 15 2018 2:20 PM

పాక్ ఉగ్రదాడిని ఖండించిన మోదీ - Sakshi

పాక్ ఉగ్రదాడిని ఖండించిన మోదీ

పెషావర్లోని పాఠశాలలో ఉగ్రవాదులు జరిపిన పిరికి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు.

పెషావర్లోని పాఠశాలలో ఉగ్రవాదులు జరిపిన పిరికి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఈ విషయమై ఆయన ట్వీట్లు చేశారు. ఇది ఏమాత్రం ఆలోచన లేని, అసలు మాట్లాడేందుకు కూడా వీల్లేనంత దారుణమైన దాడి అని, అమాయకులైన చిన్న పిల్లల ప్రాణాలను వాళ్లు తీసేశారని మోదీ చెప్పారు.

పాఠశాలకు వెళ్లిన చిన్నారులను చిదిమేయడం దారుణమన్నారు. తమ సంబంధీకులను కోల్పోయిన ప్రతి ఒక్కరికి మోదీ తన మనఃపూర్వక సంతాపం తెలిపారు. వారి బాధను తానూ పంచుకుంటున్నానని, వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement