బడ్జెట్‌ 2019 : అంగన్‌వాడీల వేతనాలు పెంపు

Piyush Goyal Announces Anganwadi Employees Salary Increase Upto 50 Percent - Sakshi

న్యూఢిల్లీ : బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట  వేసిందని పీయూష్‌ గోయల్‌ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని 8 కోట్ల మందికి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వాడానికి రూపొందించిన ‘ప్రధాన్‌ మంత్రి ఉజ్వాలా యోజన ’పథకంలో భాగంగా ఇప్పటికే 6 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. అంతేకాక అంగన్‌వాడీ సిబ్బంది వేతానాన్ని 50 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు.

అంతేకాక ‘ప్రధాన్‌ మంత్రి ముద్రా యోజన’ పథకంలో 75 శాతం మంది మహిళా లబ్ధిదారులున్నట్లు తెలిపారు. ‘మాతృత్వ యోజన’ పథకం ద్వారా మహిళా ఉద్యోగులకు 26 వారాల సెలవు దినాలు ఇస్తున్నట్లు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top