లక్షన్నర అప్పు తీర్చనందుకే ఫూగే హత్య! | Phuge murder because of Loan | Sakshi
Sakshi News home page

లక్షన్నర అప్పు తీర్చనందుకే ఫూగే హత్య!

Jul 17 2016 8:08 AM | Updated on Sep 4 2017 5:01 AM

లక్షన్నర అప్పు తీర్చనందుకే ఫూగే హత్య!

లక్షన్నర అప్పు తీర్చనందుకే ఫూగే హత్య!

రూ. లక్షన్నర రుణ వసూలు కోసం కొడుకు స్నేహితులే దత్తా ఫూగేను చంపినట్లు విచారణలో తెలిసింది. ‘పింప్రీ గోల్డ్‌మాన్’ గా పేర్గాంచిన ఫూగే గురువారం రాత్రి హత్యకు గురవడం తెలిసిందే.

పుణే : రూ. లక్షన్నర రుణ వసూలు కోసం కొడుకు స్నేహితులే దత్తా ఫూగేను చంపినట్లు విచారణలో తెలిసింది. ‘పింప్రీ గోల్డ్‌మాన్’ గా పేర్గాంచిన ఫూగే గురువారం రాత్రి హత్యకు గురవడం తెలిసిందే. ఐదుగురు అనుమానితులను విచారించిన పోలీసులు ఈ వివరాలు వెల్లడించారు. గురువారం రాత్రి ప్రధాన నిందితుడు అతుల్ మోహిత్ ...ఫూగే కొడుకు శుభంకు ఫోన్‌చేసి ఓ స్నేహితుని బర్త్‌డే పార్టీకి రావాలన్నాడు. తండ్రినీ వెంట తీసుకురమ్మన్నాడు. వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకురమ్మన్నాడు.

విషయం తండ్రికి చెప్పిన శుభం మరో స్నేహితుడు రోహన్‌తో కలిసి ఆహారం తెచ్చేందుకు కారులో వె ళ్లాడు. వారు పార్టీ జరిగే ప్రదేశానికి వచ్చే సరికి మోహిత్, మరికొందరు ఆయుధాలతో ఫూగేపై దాడి చే స్తున్నారు ఫూగే అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. దుండగులు చీకట్లో పారిపోయారు. దత్తా ఫూగే... నిందితులకు చెల్లించాల్సిన రూ.లక్షన్నర అప్పే ఈ హత్యకు కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది.

Advertisement
 
Advertisement
Advertisement