కొనసాగుతున్న పెట్రో మంట | Petrol, diesel prices continue to breach record levels on Monday | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న పెట్రో మంట

Sep 11 2018 3:40 AM | Updated on Jul 6 2019 3:20 PM

Petrol, diesel prices continue to breach record levels on Monday - Sakshi

న్యూఢిల్లీ: పెట్రో ఉత్పత్తుల ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. విపక్షాలు భారత్‌ బంద్‌ నిర్వహించినప్పటికీ ధరల పెరుగుదల ఆగలేదు. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడంతో దిగుమతుల ధర పెరిగింది. దీంతో సోమవారం పెట్రోల్‌ ధర లీటర్‌కు 23 పైసలు, డీజిల్‌ 22 పైసలు పెరిగింది. తాజా మార్పులతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.80.73కు చేరగా.. డీజిల్‌ ధర రూ.72.83గా ఉంది. కాగా, ప్రస్తుతానికి ధరలను నియంత్రించే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేయడంతో వినియోగదారులపై మరింత భారం తప్పేట్లు లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement