సీఎంగా నేడు పెమా ఖండూ ప్రమాణం | Pema Khandu To Take Oath As Arunachal Chief Minister Today | Sakshi
Sakshi News home page

సీఎంగా నేడు పెమా ఖండూ ప్రమాణం

Jul 17 2016 11:28 AM | Updated on Aug 20 2018 5:23 PM

అరుణాచల్ ప్రదేశ్ శాసనసభా పక్షనేతగా ఎన్నికైన పెమా ఖండూ(36) ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్ శాసనసభా పక్షనేతగా ఎన్నికైన పెమా ఖండూ(36) ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. నబమ్ టుకీ స్థానంలో నిన్న ఖండూ శాసన సభా పక్షనేత గా ఎన్నికైన విషయం తెలిసిందే.

మొత్తం 60 మంది సభ్యులున్న శాసనసభలో కాంగ్రెస్ కు 45 మంది సభ్యులున్నారు. మరో ఇద్దరు ఇండిపెండెండ్ సభ్యుల మద్ధతు ఆపార్టీకి ఉంది.  సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నిన్న బలపరీక్ష నిర్వహించాల్సి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేకపోవడంతో అది వాయిదా పడింది. పెమా ఖండూ బాధ్యతలు చేపట్టిన తర్వాత బల పరీక్ష ఎదుర్కొనే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement