పార్లమెంటులో పార్టీ కార్యాలయాల కేటాయింపు | Sakshi
Sakshi News home page

పార్లమెంటులో పార్టీ కార్యాలయాల కేటాయింపు

Published Thu, Sep 26 2019 2:10 PM

Party Offices Allocated In Parliament  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంటులోని వివిధ రాజకీయ పార్టీలకు పార్లమెంటరీ పార్టీ కార్యాలయాలను కేటాయించారు. మొత్తం పదిహేను పార్టీలకు పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో గదులు కేటాయించారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఉత్వర్వులు జారీ చేశారు. పార్లమెంటులోని గ్రౌండ్‌ ష్లోర్‌లోని అయిదవ నెంబర్‌ గదిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కేటా​యించారు. గతంలో ఆ గదిలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయం కొనసాగింది. ఎంపీల సంఖ్య ఆధారంగా చేసుకొని పార్లమెంటులో ఈ పార్టీ కార్యాలయాలు కేటాయించారు. పార్టీకి ఐదుగురు ఎంపీల కంటే ఎక్కవ ఉంటేనే పార్టీ కార్యాలయాలు కేటాయిస్తున్న లోక్‌సభ కార్యాలయం.

Advertisement
 
Advertisement
 
Advertisement