కొలీజియంకు పార్లమెంటరీ కమిటీ మద్దతు | Parliamentary Committee Support to Collegium | Sakshi
Sakshi News home page

కొలీజియంకు పార్లమెంటరీ కమిటీ మద్దతు

Dec 10 2016 2:56 AM | Updated on Sep 2 2018 5:24 PM

జడ్జీల నియామక ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాల ముసాయి దాలో వివాదాస్పద నిబంధనపై న్యాయవ్యవస్థకు పార్లమెంటరీ కమిటీ బాసటగా నిలిచింది.


న్యూఢిల్లీ: జడ్జీల నియామక ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాల ముసాయి దాలో వివాదాస్పద నిబంధనపై న్యాయవ్యవస్థకు పార్లమెంటరీ కమిటీ బాసటగా నిలిచింది. జాతీయ భద్రత, ప్రజా ప్రయోజనం దృష్ట్యా జడ్జి పదవికి అభ్యర్థిని తిరస్కరించే అధికారం ఈ నిబంధన ప్రభుత్వానికి కల్పిస్తోంది. ఈ నిబంధన వీటో అధికారంతో సమానమని, ఇది రాజ్యాంగానికి విరుద్ధమంటూ న్యాయ, వ్యక్తిగత వ్యవహారాలపై ఏర్పాౖటెన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు, 24 హైకోర్టుల్లో జడ్జీల ఖాళీలపై తన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. జాతీయ భద్రత, ప్రజా ప్రయోజనం పేరుతో సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల్ని తిరస్కరించాలంటూ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తమకు అర్థమైందని కమిటీ పేర్కొంది. ఇది న్యాయ వ్యవస్థపై ప్రభుత్వం పెత్తనం చేయడమే అవుతుందని, కేంద్రం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement